అన్నింటికంటే కుటుంబం ముఖ్యం: యాంకర్‌, నటి అనసూయ
Advertisement
జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కుటుంబ జీవితానికి మించింది ఏమీ ఉండదని, మనం ఏం సాధించినా, ఎంత సంపాదించినా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేందుకే కదా అని యాంకర్‌, సినీ నటి అనసూయ భరద్వాజ్‌ అన్నారు. ‘అనసూయ తొందరగా పెళ్లి చేసుకుంది, లేదంటే మంచి హీరోయిన్‌ అయి ఉండేదంటూ’ అభిమానులు తరచూ అన్న మాటలకు తనదైన శైలితో సమాధానమిచ్చింది.

సామాజిక మాధ్యమాల్లో భర్త, పిల్లలతో ఉన్న ఫొటో పోస్టు చేస్తూ, తాను సాధించిన వాటిలో అన్నింటి కంటే గొప్పది తన కుటుంబమని పేర్కొంది. తాను జీవితంలో పొందిన వాటికి సిగ్గుపడడం లేదని, గర్వపడుతున్నానని చెప్పింది. పని ప్రదేశంలో మగవాళ్లకు లేని హద్దులు ఆడవాళ్లకే ఎందుకని అనసూయ ప్రశ్నించింది. పని ప్రదేశంలో తనలాగే ఆలోచించే వారితో కలిసి పనిచేసేందుకు తనకెప్పుడూ ఇబ్బంది ఉండదని చెప్పింది. 
Mon, Jul 22, 2019, 12:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View