'మహా సముద్రం' విషయంలో మనసు మార్చుకున్న రవితేజ
Advertisement
ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతితో 'మహా సముద్రం' సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవలసింది. కానీ పారితోషికం విషయంలో రవితేజ మెట్టు దిగకపోవడమే కారణమనే టాక్ వినిపించింది.

రవితేజ అడిగిన పారితోషికాన్ని తాను ఇవ్వలేనని నిర్మాత తేల్చి చెప్పాడట. అయితే 'మహా సముద్రం' కథ తనకి బాగా నచ్చడంతో, ఆ కథను వదులుకోవడం ఇష్టం లేని రవితేజ, లాభాల్లో వాటా ఇస్తే ఓకే అని అనేశాడట. అందుకు నిర్మాత అంగీకరించిన కారణంగానే ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైందని అంటున్నారు. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. 
Mon, Jul 22, 2019, 12:07 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View