సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ కు లక్కీ చాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భారతీయుడు 2' చిత్రంలో ఓ కథానాయికగా ఆమెను అడుగుతున్నట్టు సమాచారం. ఈ విషయంపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇప్పటికే ఇందులో కాజల్ ప్రధాన నాయికగా నటిస్తోంది.
*  ఆమధ్య 'గీతగోవిందం' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పరశురాం తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్నాడు. తాజాగా పరశురాం చెప్పిన కథకు మహేశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ నిర్మిస్తాడట.
*  తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు రెండు నెలల హాలిడే తీసుకోనున్నాడు. ఈ సెలవుల్లో వర్కౌట్స్ చేసి, తన శరీరాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టు పూరి చెప్పాడు. 
Mon, Jul 22, 2019, 07:13 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View