బిగ్ బాస్-3 ప్రారంభం... తొలి విడత కంటెస్టెంట్లు వీళ్లే!
Advertisement
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున తనదైన శైలిలో కార్యక్రమాన్ని ఆరంభించగా, మొదటి విడతగా ముగ్గురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. తీన్మార్ సావిత్రిగా పేరుగాంచిన యాంకర్ శివజ్యోతి, సీరియల్ నటుడు రవికృష్ణ, డబ్ స్మాష్ స్టార్ ఆషు రెడ్డి తొలి ముగ్గురు కంటెస్టెంట్లు. వీరు ముగ్గురూ హౌస్ లోకి రాగానే బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. కాగా, బిగ్ బాస్ షెడ్యూల్ ప్రకారమే ప్రారంభం కావడంతో షో జరుగుతుందా లేదా అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు, ఇతర సిబ్బందిపై ఆరోపణలు రావడం, హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగ్ ఇంటి ముందు ఓయూ విద్యార్థుల ధర్నాల నేపథ్యంలో షో నిర్వహణపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే, స్టార్ మా చానల్ లో ముందుచెప్పిన సమయానికే బిగ్ బాస్-3 ప్రారంభం కావడంతో అనుమానాలు తొలగిపోయాయి.
Sun, Jul 21, 2019, 09:42 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View