బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు!
Advertisement
బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, మరుగుదొడ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేయడానికి తను ఎంపీగా ఎన్నిక కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం చేస్తానని చెప్పి ఎంపీని అయ్యానో వాటన్నింటినీ చేసేందుకు కట్టుబడి ఉన్నానని, నిజాయతీగా చేస్తానని వ్యాఖ్యానించారు. ‘స్వచ్ఛభారత్’ కు అందరూ కలిసి రావాలంటూ ఒకవైపు ప్రధాని మోదీ పిలుపునిస్తుంటే, మరోవైపు సాథ్వి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
Sun, Jul 21, 2019, 09:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View