బెంగళూరు అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం కుమారస్వామి
Advertisement
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సీఎం అనారోగ్యంపాలయ్యారని, ఆయన బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. అయితే, కుమారస్వామి అనారోగ్యం అంతా ఓ పెద్ద డ్రామా అని బీజేపీ మండిపడింది. విశ్వాసపరీక్ష నేపథ్యంలో కుమారస్వామి కొత్త ఎత్తుగడ వేశారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు, కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి విశ్వాసపరీక్ష నిర్వహించేందుకు మరికొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అసంతృప్త ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారు. రేపు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీకి గైర్హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Sun, Jul 21, 2019, 08:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View