కేసీఆర్ కుటుంబం బండారం బయటపడే రోజులు దగ్గరపడ్డాయి: డీకే అరుణ
Advertisement
సీఎం కేసీఆర్ నియంత పాలనను అంతం చేసే శక్తి బీజేపీకే ఉందని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సిద్ధిపేటలో డీకే అరుణ మాట్లాడుతూ, ప్రగతి భవన్ నిర్మాణంతోనే అవినీతికి బీజం పడిందని, ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, వారి బండారం బయటపడే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికల గురించి ఆమె ప్రస్తావిస్తూ ఎన్నికల్లో లబ్ధి కోసమే పెన్షన్ల హంగామా చేస్తున్నారని టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ స్కామ్ లను బయటకు తీసి దోషులను జైలుకు పంపడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023లో రాష్ట్రంలో కాషాయజెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
Sun, Jul 21, 2019, 08:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View