ఏపీ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు: బీజేపీ నేత పురందేశ్వరి
Advertisement
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా, సాధించి తీరతామంటూ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టి విధానంపై ప్రభుత్వంపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం చెబుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థతో ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డ పురందేశ్వరి, రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని, తమ పార్టీలోకి ఇతర పార్టీల నేతల రాకలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
Sun, Jul 21, 2019, 08:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View