ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ రేసులో జూనియర్ ఎన్టీఆర్, పీవీ సింధు..?
Advertisement
ఏపీలో జగన్ సర్కారు టూరిజం రంగంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో కూడా అగ్రగామిగా నిలపాలన్న ప్రయత్నాల్లో భాగంగా జనాకర్షణ ఉన్న సెలబ్రిటీలను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎవరిని అంబాసిడర్ గా నియమిస్తారన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. బలంగా వినిపిస్తున్న ప్రచారం ఏంటంటే, టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్, బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

జూనియర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నాని ఇప్పుడు వైసీపీ సర్కారులో మంత్రి. అంతేకాదు, స్వయానా పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ నేత. దాంతో, సహజంగానే ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇక, అంతర్జాతీయ స్థాయిలో ఘనవిజయాలు సాధిస్తూ, దేశంతో పాటు తెలుగు ఖ్యాతిని కూడా ఇనుమడింపచేస్తున్న పీవీ సింధు కూడా ఏపీ సర్కారు దృష్టిలో ఉందని టాక్ వినిపిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ వ్యక్తి ఉంటే టూరిజం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Sun, Jul 21, 2019, 07:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View