అందుకే, ఇప్పటికీ నా కెరీర్ కొనసాగుతోంది: సింగర్ సునీత
- నా జీవితంలో ఏదీ అంత తేలికగా రాలేదు
- సినిమాల్లో పాడే అవకాశాలు సులువుగానే వచ్చాయి
- ఆ అవకాశాలను నిలబెట్టుకోవడానికి కష్టపడ్డా
Advertisement
ప్రముఖ గాయని సునీత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 4న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఓ మ్యూజికల్ షోను ఆమె నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చిన్న వయసులోనే సినీ సింగర్ గా తన కెరీర్ ప్రారంభమైందని, క్రమక్రమంగా తనంతట తాను కష్టపడి నేర్చుకున్నానని, జీవితంలో ఏదీ కూడా తనకు అంత తేలికగా రాలేదని అన్నారు.
సినిమాల్లో పాడే అవకాశాలు తనకు సులువుగానే వచ్చినా, ఆ అవకాశాలను నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే అయిందని అన్నారు. అంత కష్టపడి నేర్చుకున్నాను కనుకనే ఇప్పటికీ తాను నిలబడగలిగానని, తన కెరీర్ కొనసాగుతోందని అనుకుంటున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమలోకి తాను వచ్చిన కొత్తల్లో అందరినీ నమ్మేసేదానినని, ఇప్పుడు, ఏదో నమ్మాలో? ఏది నమ్మకూడదో? తనకు తెలిసిందని అన్నారు.

Sun, Jul 21, 2019, 05:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com