ప్రముఖ షోకు వెళుతున్నాను... అక్కడ ఎన్ని రోజులుంటానో ఏమో: సినీ నటి హేమ!
Advertisement
తాను ఓ ప్రముఖ టీవీ షోలో పాల్గొనేందుకు వెళుతున్నానని, అక్కడ ఎన్ని రోజులుంటానో, ఏమో తెలియదని క్యారెక్టర్ నటి హేమ వ్యాఖ్యానించింది. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆమె, తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, తనను తాను పరీక్షించుకోవడానికే ఆ షోలో పాల్గొనేందుకు వెళుతున్నానని తెలిపింది. తూర్పు గోదావరి ప్రజలు తనను గెలిపించాలని కోరుతున్నానని, ఎన్ని రోజులు అక్కడే ఉంటానో తెలియదని అంది.

తన కుటుంబాన్ని వదిలి తానుండగలనా? లేదా? ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారు? వంటి విషయాలను తెలుసుకోబోతున్నానని పేర్కొంది. కాగా, హేమ బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళుతోందని సమాచారం. ఆ విషయంపైనే ఆమె పై వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, తాను త్వరలోనే రాజమహేంద్రవరంలో ఇల్లు తీసుకుంటానని, ఇకపై ఇక్కడే ఉండి, ప్రజలకు సేవ చేస్తానని హేమ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఒకసారి తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని, మరోసారి రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇక సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది.
Sun, Jul 21, 2019, 12:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View