కథపై నివేదా థామస్ కి గల నమ్మకం చూసి భయమేసింది: దర్శకుడు వివేక్ ఆత్రేయ
Advertisement
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'బ్రోచేవారెవరురా' భారీ విజయాన్ని సాధించింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.

"ఈ సినిమాలో 'మిత్ర' పాత్ర కోసం నివేదా థామస్ ను అనుకుని ఆమెకి కథ చెప్పాను. ఎంత మాత్రం ఆలోచించకుండా ఆమె ఓకే చెప్పేసింది. ఆ రోజు నుంచి కూడా ఆమె ఈ కథపై ఎంతో నమ్మకాన్ని కనబరుస్తూ వచ్చింది. ఈ కథపై ఆమెకి గల నమ్మకాన్ని చూసినప్పుడు ఒక్కోసారి నాకు భయమేసేది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనే టెన్షన్ నాలో కలిగేది. తన పాత్రకి డైలాగ్స్ తక్కువైనా, కళ్లతోనే ఆమె హావభావాలను పలికించింది. నివేదా పాత్రకి ప్రశంసలు దక్కడంతో, ఆమె నమ్మకాన్ని నిలబెట్టినందుకు తేలికగా ఊపిరి పీల్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Sat, Jul 20, 2019, 05:53 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View