జనసేన న్యాయ విభాగం సమన్వయకర్తగా ప్రతాప్ నియామకం
Advertisement
జనసేన పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో భాగంగా మరో కీలక నియామకం జరిగింది. పార్టీ న్యాయ విభాగం సమన్వయకర్తగా సీనియర్ అడ్వొకేట్ సాంబశివ ప్రతాప్ ను నియమించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ప్రతాప్ పార్టీ తరఫున లీగల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు.  ప్రతాప్ కు హైకోర్టు స్థాయి న్యాయవాదిగా ఎంతో గుర్తింపు ఉంది. జనసేన లీగల్ వింగ్ కోఆర్డినేటర్ గా ప్రతాప్ ను నియమిస్తూ ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర వేశారు. ఎంతో అనుభవం ఉన్న ప్రతాప్ జనసేనకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ప్రకటన వెలువడింది.
Sat, Jul 20, 2019, 04:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View