ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
Advertisement
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె... ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పంజాబ్ లోని కపుర్తలలో 1938 మార్చి 31న షీలా దీక్షిత్ జన్మించారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను నిర్వహించారు. 1998 నుంచి 2013 వరకు సీఎంగా వ్యవహరించారు. కేరళ గవర్నర్ గా కూడా ఆమె పని చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. గతంలో లోక్ సభ అంచనాల కమిటీకి ఆమె సేవలందించారు. 
Sat, Jul 20, 2019, 04:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View