రిటైర్మెంట్‌ వార్తల నేపథ్యంలో ధోనీ కీలక ప్రకటన
Advertisement
తన రిటైర్మెంట్ పై జోరుగా చర్చ జరుగుతున్న వేళ... తన మనసులో ఏముందో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ స్పష్టం చేశాడు. త్వరలో జరగనున్న వెస్టిండీస్ టూర్ కు తాను అందుబాటులో ఉండనని ప్రకటించాడు. రెండు నెలల పాటు ప్యారామిలిటరీ రెజిమెంట్ కు సేవలందించాలనుకుంటున్నానని బీసీసీఐకి తెలిపాడు. భారత సైన్యానికి చెందిన ప్యారాచూట్ రెజిమెంట్లో ఆనరరీ లెఫ్టినెంట్ కల్నల్ గా ధోనీ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, 'మూడు విషయాలపై స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ కావడం లేదు. ప్యారామిలిటరీ రెజిమెంట్ కు రెండు నెలల పాటు ధోనీ సేవ చేయబోతున్నాడు. ఇది ముందే తీసుకున్న నిర్ణయం. ధోనీ నిర్ణయాన్ని కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు తెలియజేశాం' అని తెలిపారు.
Sat, Jul 20, 2019, 03:55 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View