సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  కథానాయిక తమన్నా తాజాగా తమిళంలో 'పెట్రోమాక్స్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా తాప్సీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. విశేషం ఏమిటంటే, ఆమధ్య తాప్సీ తెలుగులో నటించిన 'ఆనందోబ్రహ్మ' చిత్రానికి ఈ 'పెట్రోమాక్స్' రీమేక్ గా రూపొందుతోందట.
*  యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న 'చాణక్య' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో టాకీ పార్ట్ పూర్తవుతుందని, వచ్చే నెలలో పాటలను చిత్రీకరిస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.
*  అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఆమన్ ప్రీత్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గతంలో నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడుతా' చిత్రం టైటిల్ని నిర్ణయించారు. విశేషం ఏమిటంటే, నాగార్జున చేతుల మీదుగా నిన్న ఈ టైటిల్ లోగోను ఆవిష్కరింపజేశారు. 
Sat, Jul 20, 2019, 07:18 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View