రేపటి నుంచే బిగ్‌బాస్ సీజన్ 3.. పోటీదారుల పేర్లు లీక్ చేసిన నూతన్ నాయుడు
Advertisement
తెలుగు బిగ్‌బాస్ షో మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.  

నూతన్ నాయుడు వెల్లడించిన పేర్లలో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి ఉన్నారు.  

ఈ జాబితా తనకు ఎలా వచ్చిందీ చెప్పని నూతన్ నాయుడు.. రేపటి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది మాత్రం కచ్చితంగా వీళ్లేనని చెబుతున్నాడు.
Sat, Jul 20, 2019, 06:45 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View