చిన్న పొరబాటు చేసిన అమెజాన్... పండగ చేసుకున్న కస్టమర్లు!
Advertisement
ప్రముఖ ఈకామర్స్ పోర్టల్ అమెజాన్ అప్పుడప్పుడు బొనాంజా సేల్స్ జరుపుతుంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తుంటుంది. ఎంత విక్రయించినా ఓ 40, 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. కానీ, అమెజాన్ చేసిన ఓ పొరబాటు కస్టమర్ల పాలిట వరమైంది. కొనుగోలు ధర పేర్కొనాల్సిన చోట అంకెల్లో జరిగిన పొరబాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని ఫలితమే రూ.9 లక్షల విలువైన బ్రాండెడ్ కెమెరాను రూ.6,500కి ఎగరేసుకెళ్లారు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా ఓ అత్యాధునిక కెమెరాపై కూడా ఆఫర్ ఇచ్చింది. అయితే, కొనుగోలు ధరను కేవలం రూ.6,500గా పేర్కొనడంతో కస్టమర్లు కుమ్మేశారు. దీని అసలు ఖరీదు రూ.9 లక్షలు. సోనీ ఎ6000 కెమెరాకు కూడా ఇదే గతి పట్టింది. దీని వాస్తవ ఖరీదు రూ.4 లక్షలు కాగా, వినియోగదారులు దీన్ని సైతం అత్యంత చవకగా రూ.6,500కి దక్కించుకున్నారు.

అయితే, తాము అత్యంత చీప్ గా కొన్న కెమెరాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టేసరికి అమెజాన్ చూసి అవాక్కయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారీ సంఖ్యలో ఖరీదైన కెమెరాలకు రెక్కలొచ్చాయి. చేసేదేమీలేక అప్పటికి బుక్ అయిన ఆర్డర్లను మాత్రం రద్దు చేసిన అమెజాన్ ఉసూరుమంది.
Fri, Jul 19, 2019, 10:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View