బీసీలకు లబ్ది చేకూరేలా జగన్ సర్కారు కీలక నిర్ణయం
Advertisement
ఏపీ సర్కారు బీసీలకు లబ్ది చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ అయింది. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ, రజక, టైలర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని తీర్మానించారు. బీసీలకు ఆర్థిక సాయం అందించే ఈ ప్రతిపాదనకు మంత్రిమండలిలో ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంతేగాకుండా, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించనున్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Fri, Jul 19, 2019, 08:58 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View