కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా
Advertisement
కర్ణాటక రాజకీయ గందరగోళం ఇప్పట్లో సమసిపోయేట్టు కనిపించడంలేదు. వరుసగా రెండో రోజు కూడా కర్ణాటక విధానసభలో బలపరీక్ష నిర్వహణ సాధ్యంకాలేదు. ఇవాళే విశ్వాసపరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబట్టినా, 'ముందు చర్చ.. ఆ తర్వాతే ఓటింగ్' అంటూ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ దృఢవైఖరి ప్రదర్శించారు. దాంతో, బీజేపీ సభ్యులు సభలో పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ నేపథ్యంలో, గందరగోళం మధ్యనే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Fri, Jul 19, 2019, 08:41 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View