పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు, ప్రభుత్వానికి న్యాయం చేస్తాం: సీఎం వైఎస్ జగన్
Advertisement
ఏపీలో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) పై ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల నిమిత్తం ఆయా సంస్థలతో అధిక రేట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు చేస్తోంది. తాజాగా, ఇదే విషయమై ఏపీ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. అవసరం లేకున్నా గత ప్రభుత్వం తమకు కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. ఆ ఒప్పందాల ద్వారా ఏటా రూ.2,766 కోట్ల నష్టం వస్తోందని, ఈ భారాన్ని మోసే పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు లేవని అన్నారు. పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు, ప్రభుత్వానికి న్యాయం చేస్తాం అని జగన్ స్పష్టం చేశారు.
Fri, Jul 19, 2019, 08:13 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View