ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరతారు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Advertisement
తాను బీజేపీలో చేరతానని ఒకసారి, చేరనని మరోసారి చెబుతున్న టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి ఎంపీ, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని వ్యాఖ్యానించారు. తన లాంటి వ్యక్తి బీజేపీలో చేరితేనే తెలంగాణలో ఆ పార్టీ బలపడుతుందని అన్నారు. ఒకవేళ, తాను బీజేపీలో చేరినా, ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే ఓడగా అభివర్ణించిన రాజగోపాల్ రెడ్డి, టైటానిక్ షిప్ లో తన లాంటి హీరో ఉన్నా అది మునిగిపోవాల్సిందేనంటూ పరోక్షంగా ‘కాంగ్రెస్’పై వ్యాఖ్యలు చేశారు.
Fri, Jul 19, 2019, 07:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View