ప్రపంచ బ్యాంకే వెనక్కిపోతే ఇక ఇతర పెద్ద బ్యాంకులూ ముందుకురావు: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
Advertisement
ఏపీకి ప్రపంచ బ్యాంకు నిధులిచ్చేందుకు వెనుకడుగు వేసిందని, దీని ప్రభావంతో ఇతర పెద్ద బ్యాంకులు కూడా ముందుకురావని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఆర్థికలోటుతో ఉన్న రాష్ట్రమని, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం లేదని అన్నారు. ఏపీ బడ్జెట్ ఈగలమోతలా ఉందని, రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం, జలవనరుల ప్రాజెక్టులు ఆగిపోతాయని, కేవలం, ‘నవరత్నాలు’ పేరుతో దోపిడీ మాత్రం జరగుతుందని వ్యాఖ్యనించారు.
Fri, Jul 19, 2019, 06:46 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View