ఇన్ స్టాగ్రామ్ లో లోపాన్ని గుర్తించి రూ.20 లక్షలు అందుకున్న చెన్నై టెక్కీ
Advertisement
చెన్నైకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు లక్ష్మణ్ ముత్తయ్య ఇన్ స్టాగ్రామ్ లో ఓ బగ్ ను గుర్తించి నగదు బహుమానం అందుకున్నాడు. ఫేస్ బుక్ కు చెందిన ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో తీవ్రమైన లోపం ఉందని, ఎవరి అకౌంట్ నైనా సులువుగా హ్యాక్ చేసే వీలుందని లక్ష్మణ్ గుర్తించాడు. పాస్ వర్డ్ రీసెట్ ఆప్షన్ ద్వారా ఇతరుల అకౌంట్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించే లొసుగు కనిపిస్తోందని లక్ష్మణ్ తన పరిశోధన ద్వారా వెల్లడించాడు.

పాస్ వర్డ్ రీసెట్ చేసే సమయంలో ఫోన్ కు గానీ, ఈమెయిల్ కు గానీ వచ్చే రికవరీ కోడ్ ను చేజిక్కించుకోవడం ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద కష్టంకాదని లక్ష్మణ్ ఫేస్ బుక్ నిపుణులకు వివరించాడు. ఈ చెన్నై నిపుణుడి సూచనలకు వెంటనే స్పందించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నిపుణులు వెంటనే సదరు బగ్ ను ఫిక్స్ చేశారు. పాస్ వర్డ్ రీసెట్ ప్రక్రియలోని లోపాన్ని సవరించారు. అంతేకాకుండా, ఎంతో విలువైన సూచన చేశాడంటూ లక్ష్మణ్ కు రూ.20 లక్షల రివార్డు కూడా అందించారు.
Fri, Jul 19, 2019, 05:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View