బీజేపీలో చిరంజీవి చేరే విషయమై ఎమ్మెల్సీ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement
టీడీపీ నేతలే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత, ప్రముఖ హీరో చిరంజీవి కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చిరంజీవి చేరే విషయమై రాష్ట్ర స్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరపలేదని, మరి, జాతీయ స్థాయి నేతలతో ఆయన టచ్ లో ఉన్నారేమో తమకు తెలియదని స్పష్టం చేశారు. వచ్చే నెల 11 తర్వాత పార్టీలో కీలక మార్పులు, చేర్పులు జరగనున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీకి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పడం గమనార్హం.
Fri, Jul 19, 2019, 04:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View