సీఎం కుమారస్వామికి మరోసారి లేఖ రాసిన గవర్నర్
Advertisement
కర్ణాటకలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి నడిసముద్రంలో నావలా తయారైంది. సీఎం కుమారస్వామి దారీతెన్నూ తోచని స్థితిలో పడిపోయారు. మధ్యాహ్నం 1.30 గంటల్లోపు మెజారిటీ నిరూపించుకోవాలని సంకీర్ణ సర్కారుకు గవర్నర్ ఇచ్చిన గడువు దాటిపోయింది. విశ్వాస పరీక్షపై చర్చ ఎటూ తేలేట్టు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా మరోసారి చొరవ తీసుకుని గడువును సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఈ సాయంత్రం 6 గంటల లోపు బలనిరూపణ చేయాలంటూ సీఎం కుమారస్వామికి మళ్లీ లేఖ రాశారు. విశ్వాస పరీక్షపై చర్చలో భాగంగా ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉన్న తరుణంలో సోమవారం నాటికి చర్చ పూర్తవుతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఓవైపు సభలో పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు గవర్నర్ లేఖలతో హడావుడి చేస్తుండడంతో కుమారస్వామి తలపట్టుకుంటున్నారు!
Fri, Jul 19, 2019, 04:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View