అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై రగడ.. నగ్న పోస్టర్లను తగులబెట్టిన మహిళలు!
Advertisement
రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆమె’ సినిమా మొదటినుంచీ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఈ సినిమాలో అమలాపాల్ కొన్ని సీన్లలో నగ్నంగా నటించడంపై పలువురు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా మహిళా సంఘాలు సినిమాకు వ్యతిరేకంగా ఉద్యమించాయి.

నగరంలోని ప్రధాన కూడళ్లలో అమలాపాల్ నగ్న చిత్రాలతో పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని మహిళా సంఘాల సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల చిన్నారులు, టీనేజర్లపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అడల్ట్ సినిమాలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘ఆమె’ సినిమా పోస్టర్లను తగులబెట్టారు. రత్నకుమార్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘ఆమె’ నేడు విడుదల అయింది.
Fri, Jul 19, 2019, 01:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View