కాంగ్రెస్ కు గాంధీల నాయకత్వం లేకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం: లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి
Advertisement
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ చాలా అవసరమని ఆయన అన్నారు. గాంధీల నాయకత్వం లేకపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. నాయకత్వ బాధ్యతలను తీసుకోవడానికి సోనియాగాంధీ కూడా సుముఖత చూపలేదు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్టా పార్టీ పగ్గాలను తాను స్వీకరించలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ శాస్త్రి మాట్లాడుతూ, ప్రియాంకగాంధీ నాయకత్వ బాధ్యతలను చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
Fri, Jul 19, 2019, 01:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View