తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీ హాస్టల్ లో భారీ చోరీ!
తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీలో భారీ చోరీ చోటుచేసుకుంది. విద్యార్థినులు కాలేజీకి వెళ్లగానే హాస్టల్ లోని హరిణి బ్లాక్ లోకి చొరబడ్డ దొంగలు బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో 300 మంది యువతులకు చెందిన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని సమాచారం. రూ.50,000 నగదుతో పాటు బంగారు కమ్మలు, చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు దొంగతనానికి గురయ్యాయని తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై విద్యార్థినులు, హాస్టల్ యాజమాన్యం ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
Fri, Jul 19, 2019, 11:59 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View