చంద్రయాన్-2ను మించేలా నాసా ప్రయోగం... మనుషులను పంపి అక్కడే ఉంచనున్నట్టు వెల్లడి!
Advertisement
చంద్రునిపై మానవుడు కాలుమోపి అర్ధ శతాబ్ధం అయింది. 1969లో అమెరికా మిషన్ మూన్ ను నిర్వహించగా, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుపెట్టిన తొలి మానవుడిగా రికార్డు సృష్టించాడు. ఆపై మరికొన్ని మిషన్ల ద్వారా మానవులు వెళ్లినప్పటికీ, గత కొన్ని దశాబ్దాలుగా చంద్రునిపైకి మనుషులను పంపే ప్రాజక్టులు కార్యరూపం దాల్చలేదు.

ఇక తాజాగా, ఇండియా చంద్రునిపై పరిశోధనలు చేసి, నీటి జాడలు, ఖనిజాన్వేషణ నిమిత్తం 'చంద్రయాన్-2'ను మొదలుపెట్టగా, అంతకుమించిన ప్రాజెక్టును చేపట్టనున్నట్టు నాసా ప్రకటించింది. తాము త్వరలోనే చంద్రునిపైకి వెళ్లనున్నామని, ఈ దఫా అక్కడే మకాం వేస్తామని తెలిపింది.

ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న నాసా, స్పేస్ సూట్ ఇంజనీర్ లిండ్సే అట్చిసన్ రూపొందించిన స్పేస్ సూట్, చంద్రుని ఉపరితలంపై మానవులను సురక్షితంగా ఉంచుతుందని పేర్కొంది. 2028లోగా చంద్రునిపైకి మానవులను పంపి, వారిని అక్కడే ఉంచేలా 2024 నుంచి మిషన్ ను ప్రారంభించనున్నట్టు నాసా పేర్కొంది.
Fri, Jul 19, 2019, 11:47 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View