బొత్స గారూ.. ‘వోక్స్ వ్యాగన్’లో కొట్టేసిన డబ్బులతోనే కడతారా?: కేశినేని నాని సెటైర్లు
Advertisement
టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ వైసీపీ నేత పీవీపీపై విమర్శలు గుప్పించిన కేశినేని, తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు. ‘ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే మంచి రాజధాని నిర్మిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు ఈ నిర్మాణం చేపడతాం. ఆంధ్రుల సంస్కృతికి తగట్టు నూతన రాజధాని ఉంటుంది’ అని బొత్స చెప్పడంపై వెటకారంగా స్పందించారు.

దేశంలోనే మంచి రాజధానిని వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో కొట్టేసిన డబ్బులతోనే కడతారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. గతంలో ఏపీ భారీ పరిశ్రమల మంత్రిగా బొత్స ఉన్న సమయంలో వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో ఆయన ప్రమేయంపై పెద్ద రగడ జరిగిన సంగతి విదితమే. 
Fri, Jul 19, 2019, 10:56 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View