ఇలాంటి వాటికి నేను అనుమతించను: టీడీపీ సభ్యులపై స్పీకర్ అసహనం
Advertisement
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా వాడీవేడిగానే కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా... అధికారపక్షం దీనికి అనుమతి నిరాకరించింది. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఒకే ప్రశ్నను ఎంతసేపు లాగుతారని స్పీకర్ ప్రశ్నించారు. ఎంత సేపు చర్చించినా తృప్తి చెందకపోతే ఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేదని అన్నారు. సీనియర్ సభ్యులైన మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇతర సభ్యుల సమయాన్ని మీరు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాను అనుమతించనని... ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవద్దని సూచించారు. స్పీకర్ మాటలకు తృప్తి చెందని టీడీపీ సభ్యులు... పోలవరం ప్రాజెక్టుపై చర్చకు పట్టుబడుతూనే ఉన్నారు. దీంతో, సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Fri, Jul 19, 2019, 10:20 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View