చంటి బిడ్డల తల్లిదండ్రులకు, వృద్ధులకు ఆఫర్... తిరుమలలో ప్రత్యేక దర్శనాల అదనపు కోటా వివరాలు!
Advertisement
వృద్ధులు, ఐదేళ్ల లోపు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాల కోటాను పెంచినట్టు టీటీడీ పేర్కొంది. నెలలో ఒకరోజు కల్పించే ప్రత్యేక దర్శనాన్ని తిరిగి పునరుద్ధరించినట్టు పేర్కొన్న అధికారులు, ఈ దఫా మరిన్ని టికెట్లు కేటాయించినట్టు తెలిపారు. వేసవి రద్దీ దృష్ట్యా, ఏప్రిల్ నుంచి సుపథం దర్శనాలను రద్దు చేసిన టీటీడీ, తిరిగి వాటిని పునరుద్ధరించింది.

ఈ నెల 23, 24 తేదీల్లో చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు సుపథం ఎంట్రెన్స్ ద్వారా దర్శనం వుంటుందని, 23వ తేదీన 4 వేల టోకెన్లను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు 1000, మధ్నాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటలకు వెయ్యి టోకెన్లను ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌ లో పొందవచ్చని తెలిపారు. 24న చంటిబిడ్డల తల్లిదండ్రులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గం ద్వారా అనుమతిస్తామని వెల్లడించారు.
Fri, Jul 19, 2019, 09:12 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View