దమ్ముంటే రా తేల్చుకుందాం.. పాకిస్థాన్ మూలాలున్న బ్రిటిష్ బాక్సర్‌కు విజేందర్ సవాల్
Advertisement
భారత ఒలింపిక్ పతక విజేత, బాక్సర్ విజేందర్ సింగ్ పాక్ మూలాలున్న బ్రిటిష్ బాక్సర్‌ ఆమిర్ ఖాన్‌కు సవాల్ విసిరాడు. చిన్నపిల్లలతో తాను బౌట్‌కు దిగనని పేర్కొన్న విజేందర్.. ఆమిర్‌తో బౌట్‌కు సిద్ధమని ప్రకటించాడు. విజేందర్‌తో తలపడాలని చాలాసార్లు అనుకున్నానని, కానీ కుదరడం లేదని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. అయితే, తనను చూసి విజేందర్ భయపడుతున్నాడని  విమర్శించాడు. అతడి విమర్శలకు విజేందర్ దీటుగా బదులిచ్చాడు.

జూనియర్స్‌తో ఆడడం కాదని, తాను చిన్నపిల్లలతో ఆడనని ఆమిర్‌ను ఎద్దేవా చేశాడు. ‘‘ఆమిర్‌తో పోరుకు నేను సిద్ధంగా ఉన్నా. అతడేమో చిన్నపిల్లలతో తలపడతాడు. నీరజ్ గోయట్ నాకంటే చిన్నవాడు. గతంలోనూ చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నా. ఎక్కడైనా సరే ఆమిర్‌తో పోరుకు సిద్ధం. చిన్నపిల్లలతో ఆడడం అతడు మానుకోవాలి’’ అని విజేందర్ పేర్కొన్నాడు. ప్లాటినం హెవీ డ్యూటీ సిమెంట్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విజేందర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Fri, Jul 19, 2019, 09:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View