సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  ఏ భాషలో అవకాశాలు వస్తే అక్కడ సినిమాలు చేసేస్తోన్న కథానాయిక తమన్నా తాజాగా తమిళంలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెట్రోమాక్స్' అనే గమ్మత్తయిన టైటిల్ని నిర్ణయించారు.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించారు. 'డబుల్ ఇస్మార్ట్' పేరిట ఇప్పటికే సీక్వెల్ కు టైటిల్ని రిజిస్టర్ చేశానని చెప్పారు.
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో బోయపాటి, బన్నీ కలయికలో 'సరైనోడు' సినిమా వచ్చిన సంగతి విదితమే. 
Fri, Jul 19, 2019, 07:13 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View