విశ్వాసపరీక్షకు డెడ్ లైన్ విధించిన కర్ణాటక గవర్నర్
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం విశ్వాసపరీక్ష రేపటికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ఏది ఏమైనా సరే, ఈరోజే విశ్వాసపరీక్ష జరగాలంటూ సభలోనే బీజేపీ నేతలు బైఠాయించి, నిరసనలు తెలిపారు. తాజాగా, మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఓ లేఖ రాశారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాంగ్రెస్-జేడీఎస్ లు వారి మెజార్టీ నిరూపించుకోవాలని సూచించారు.

Thu, Jul 18, 2019, 09:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View