'బిగ్ బాస్ 3'పై నిరసనల ఎఫెక్ట్.. నాగార్జున నివాసం వద్ద పోలీస్ భద్రత
Advertisement
అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న'బిగ్ బాస్ 3' తెలుగు రియాల్టీ టీవీ షో త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని, దీన్ని రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.46 లోని నాగార్జున నివాసం వద్ద ఈరోజు సాయంత్రం నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
Thu, Jul 18, 2019, 08:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View