ఆ ఒక్క సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది: దర్శకుడు వివేక్ ఆత్రేయ
Advertisement
ఈ మధ్య కాలంలో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అలరించిన సినిమాగా 'బ్రోచేవారెవరురా' నిలిచింది. దర్శకుడిగా వివేక్ ఆత్రేయకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన జీవితంలోని ఒక విషాదకరమైన సంఘటన గురించి ప్రస్తావించాడు.

"కొన్నేళ్ల క్రితం మా అమ్మానాన్నలు 'కాశీ'కి వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి జ్వరంతోనే మా నాన్న వచ్చాడు. ఆ జ్వరం అలా ఎక్కువైపోయి బ్రెయిన్ ఫీవర్ గా మారింది. 10 రోజుల పాటు కోమాలో వున్న ఆయన, ఆ తరువాత చనిపోయాడు. హఠాత్తుగా నాన్న చనిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నిన్నటివరకూ మాతో వున్న నాన్న ఈ రోజున లేకపోవడం ఏమిటి? జీవితం ఇంతేనా? అనిపించింది. అప్పటివరకూ ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించే నన్ను ఆ సంఘటన పూర్తిగా మార్చేసింది" అని చెప్పుకొచ్చాడు.
Thu, Jul 18, 2019, 06:50 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View