'ఇస్మార్ట్ శంకర్' ప్రమోషన్స్ కి రామ్ రాకపోవడానికి కారణం అదేనట!
Advertisement
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. విడుదలకి ముందు జరిగిన ప్రమోషన్స్ లో రామ్ కనిపించలేదు. దాంతో పూరి జగన్నాథ్ కి .. రామ్ కి మధ్య రంగం చెడిందనే ప్రచారం జరిగింది. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.

ఈ సినిమాను ముందుగా ఈనెల 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. దాంతో ఆ వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి రామ్ స్పెయిన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిన తరువాత, ఈ సినిమా ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. కుటుంబ సభ్యులందరితో టూర్ ప్లాన్ చేసుకున్న కారణంగా రామ్ ఆగడం కుదరలేదని సమాచారం. అందువల్లనే తప్ప, రామ్ కి .. పూరికి మధ్య ఎలాంటి మనస్పర్థలు తలెత్తలేదనేది సన్నిహితుల మాట. 
Thu, Jul 18, 2019, 06:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View