జగపతిబాబు ఆ సినిమా నుంచి తప్పుకున్నది అందుకేనా!
Advertisement
మహేశ్ బాబు తాజా చిత్రమైన 'సరిలేరు నీకెవ్వరు' నుంచి జగపతిబాబు తప్పుకోవడం ఫిల్మ్ నగర్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ముందు మహేశ్ బాబు - జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' .. 'మహర్షి' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

కానీ జగపతిబాబు తప్పుకోవడంతో, కారణమేమిటో తెలియక అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ముందుగా ఏదైతే చెప్పారో, షూటింగుకి వెళ్లాక ఆ స్థాయిలో తన పాత్ర లేదనే సందేహం జగపతిబాబుకి కలిగిందట. అదే విషయాన్ని ఆయన దర్శకుడి దగ్గర ప్రస్తావించడం .. అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందని అంటున్నారు. తన పాత్ర రూపకల్పనలో మార్పులు చేయడం నచ్చకపోవడం వల్లనే జగపతిబాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. 
Thu, Jul 18, 2019, 06:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View