‘రాక్షసుడు’ ట్రైలర్ విడుదల.. ‘నేనంటే భయానికే భయం..’ అంటున్న హీరో బెల్లంకొండ
Advertisement
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘రాక్షసుడు’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘నేనంటే భయానికే భయం. నన్ను పట్టుకోవాలని అనుకోకు. పట్టుకుందామనుకున్నా అది నేనవను..’ అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ట్రైలర్ లో ఎంట్రీ ఇస్తాడు. పోలీసు అధికారి పాత్రలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్, ఫైటింగ్ సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. హవీష్  ప్రొడక్షన్ బ్యానర్ లో రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెల 15న ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Thu, Jul 18, 2019, 04:59 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View