'ద వెడ్డింగ్‌ గెస్ట్‌' శృంగార సీన్ లీక్... సైకోలు ఎక్కువయ్యారని రాధికా ఆప్టే మండిపాటు!
Advertisement
'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్, హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన తాజా ఆంగ్ల చిత్రం 'ద వెడ్డింగ్‌ గెస్ట్‌' విడుదలకు సిద్ధంకాగా, ఇందులోని ఓ హాట్‌ రొమాంటిక్‌ సీన్‌ లీకై వైరల్ అవుతోంది. ఈ సీన్ లో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ న్యూడ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సీన్ లీక్ కావడంపై రాధికా ఆప్టే తీవ్రంగా మండిపడింది. సమాజంలో నెలకొనివున్న సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ సీన్‌ లీక్ కావడమే ఉదాహరణని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సీన్ లో తనతో పాటు నటించిన దేవ్ పటేల్ కు బదులుగా, తనను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది.

ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి, కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ చేశారని, ఇది ఎవరో కావాలని చేసిందేనని వ్యాఖ్యానించింది. బోల్డ్ సీన్లలో నటించేందుకు తానేమీ భయపడబోనని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని, నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించానని పేర్కొంది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని ప్రశ్నించిన ఆమె, ఓ నటిగా అవసరమనిపిస్తే ఎలాగైనా నటిస్తానని తెలిపింది.
Thu, Jul 18, 2019, 09:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View