సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  సమంత ప్రధాన పాత్ర పోషించిన 'ఓ.. బేబీ' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. విడుదలైన పది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 35 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సినిమాకు ఆదరణ ఇంకా కొనసాగుతుండడంతో ఈ వసూళ్లు మరింతగా పెరుగుతాయి.
*  రానా దగ్గుబాటి ఇటు హీరోగా కొనసాగుతూనే.. అటు నిర్మాతగా కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో 'క్షణం' దర్శకుడితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రానా, త్వరలో 'ఓ.. బేబీ'ని హిందీలో రీమేక్ చేస్తానని ప్రకటించాడు. మరోపక్క, నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం 'డిస్కో రాజా' చిత్రాన్ని చేస్తున్న హీరో రవితేజ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ చిత్రాన్ని జెమిని కిరణ్ నిర్మిస్తారని తెలుస్తోంది. 
Thu, Jul 18, 2019, 07:10 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View