నగ్న సన్నివేశాల గురించి ముందే అమ్మకు చెప్పా: అమలాపాల్
Advertisement
అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆమె’. రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అమలాపాల్ నగ్నంగా కనిపించింది. ట్రైలర్‌లో తన సహనటి ఆర్జే రమ్యను ముద్దు పెట్టుకుంటూ కనిపించింది. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ముద్దు సన్నివేశంపై మీడియా అమలాను ప్రశ్నించింది.

దీనికి స్పందించిన అమల ఓ అమ్మాయిని మద్దు పెట్టుకోవడంలో తప్పేమీ లేదని, అది స్క్రిప్ట్‌లో లేదని, అనుకోకుండా తీసిన షాట్ అని తెలిపింది. ఇక నగ్న సన్నివేశాల గురించి తన తల్లికి ముందే చెప్పానని, స్క్రిప్టుకు కచ్చితంగా అవసరమైతే నటించమని తన తల్లి చెప్పిందని అమల వెల్లడించింది.

ఈ సినిమా శృంగార నేపథ్యంలో సాగేది కాదని, కంటెంట్ అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందేనని అమల తెలిపింది. ఈ చిత్రం నటిగా తనకు ఎంతో నమ్మకాన్నిచ్చిందని పేర్కొంది. తనకు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని అమల స్పష్టం చేసింది.
Wed, Jul 17, 2019, 08:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View