కో డైరెక్టర్ గా వున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను అవమానపరిచాడు: 'దొరసాని' దర్శకుడు కేవీఆర్ మహేంద్ర
Advertisement
ఇటీవల వచ్చిన 'దొరసాని' సినిమాకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. దర్శకుడిగా కేవీఆర్ మహేంద్రకి మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు.

" కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేశాను. కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరున్న ఒక ఆర్టిస్టు ఆ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. దర్శకుడి సూచన మేరకు నేను ఆ హీరోకి సీన్ చేసి చూపించాను. 'నాకు యాక్ట్ చేసి చూపిస్తావా?' అని అతను లోపల రగిలిపోతున్న విషయం నాకు తెలియదు. ఆ తరువాత ఒక చిన్న ఆర్టిస్టు రాకపోవడంతో, ఆ హీరో కాంబినేషన్లో నేనే ఆ పాత్ర చేయవలసి వచ్చింది. నా చొక్కా పట్టుకునే ఆ షాట్ ను ఆ హీరో కావాలని పదే పదే చేస్తూ, నా వల్లనే ఎక్కువ టేకులు అవుతున్నట్టుగా అవమానపరిచాడు. ఆయన అలా ఎందుకు చేస్తున్నదీ మా టీమ్ కి అర్థమైపోయింది. కానీ ఆయనను ఏమీ అనలేక నాకు ఏడుపొచ్చేసింది" అని చెప్పుకొచ్చాడు. 
Wed, Jul 17, 2019, 05:46 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View