ఇకపై నన్ను అంతా 'గుణ' అనే పిలుస్తారు: హీరో కార్తికేయ
Advertisement
కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' రూపొందింది. అనఘ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి కార్తికేయ మాట్లాడుతూ, "ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలియదు. అంతా 'ఆర్ ఎక్స్ 100' హీరో అనే రాస్తున్నారు.

'గుణ 369' విడుదలైన తరువాత మాత్రం అంతా 'గుణ' అనే పిలుస్తారు. అంతగా ఆ పాత్ర జనంలోకి వెళుతుందని అనుకుంటున్నాను. అర్జున్ జంధ్యాల ఒక అరగంట పాటు కథ చెప్పగానే, నేను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. అందుకు కారణం కథలోని కొత్తదనం .. సహజత్వం. తెరపై ఆర్టిస్టులు కాకుండా పాత్రలు మాత్రమే కనిపించేలా ఈ కథ సాగుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ మంచి థ్రిల్ ఇస్తుంది .. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.
Wed, Jul 17, 2019, 02:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View