'మిస్టర్ కె కె' సినిమాలో ప్రత్యేకతలు!
Advertisement
విక్రమ్ కథానాయకుడిగా రాజేశ్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళంలో 'కదరం కొందన్' సినిమా రూపొందింది. కమలహాసన్ తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను అక్కడ ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

'మిస్టర్ కె కె' టైటిల్ తో ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షర హాసన్ .. అభిహాసన్ .. లేనా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయట. కొంత కథ నడిచేవరకూ ఈ సినిమాలో విక్రమ్ హీరోనా? విలనా? అనే అయోమయానికి ప్రేక్షకులు లోనవుతారని అంటున్నారు. ఈ సినిమాలో విక్రమ్ చేసే స్టంట్స్ ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు. ఫ్రాన్స్ కి చెందిన స్టంట్స్ కొరియోగ్రఫర్ 'గింట్' కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయట.
Wed, Jul 17, 2019, 02:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View