అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద అందరినీ హడలగొట్టిన 'పెయింట్ డబ్బా'!
Advertisement
గతంలో అనేక పర్యాయాలు ఉగ్రదాడులకు గురైన హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఉగ్రసంచారంపై అనుమానాలు తొలగిపోలేదు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఓ పరిణామమే అందుకు నిదర్శనం. అమీర్ పేట స్టేషన్ మెట్రో పిల్లర్ వద్ద ఓ పెయింట్ డబ్బా అందరినీ భయాందోళనలకు గురిచేసింది. ఎవరో వదిలేసి వెళ్లిన ఆ పెయింట్ డబ్బా కొన్ని గంటల పాటు అక్కడే ఉండడంతో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అది బాంబు అయ్యుండొచ్చని ఆందోళన చెందడంతో డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆ పెయింట్ డబ్బాను క్షుణ్ణంగా పరిశీలించాయి. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tue, Jul 16, 2019, 09:50 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View