ప్రభాస్ 'సాహో' విడుదల వాయిదా
Advertisement
‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా విడుదల మరికొన్ని రోజులు ముందుకు వెళ్లింది.

తొలుత ‘సాహో’ను ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్థానాన్ని యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రణరంగం’ చిత్రం ఆక్రమిస్తోంది. నిజానికి ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ‘రణరంగం’ విడుదలను చిత్రబ‌ృందం ఆగస్ట్ 15కు వాయిదా వేసింది. ఈ చిత్రంతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘ఎవరు’ సినిమా కూడా విడుదల కాబోతోంది. దీనిని బట్టి చూస్తే ఆగస్ట్ మొత్తం సినీ ప్రియులకు పండగలా కనిపిస్తోంది.
Tue, Jul 16, 2019, 08:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View