పూరీ ముఖంలో సూపర్ సక్సెస్ మెరుపు ఇప్పటికే నాకు కనిపించింది: రామ్ గోపాల్ వర్మ
Advertisement
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ ను ఉత్సాహపరుస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ చిత్రం సూపర్ సక్సెస్ మెరుపు పూరీ జగన్నాథ్ ముఖంలో ఇప్పటికే తనకు కనిపించిందని వర్మ పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా నవ్వుతున్న పూరీ జగన్నాథ్ ఫొటోను వర్మ జతపరిచారు. కాగా, ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరోగా రామ్ నటించాడు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ లు నటిస్తున్నారు.
Tue, Jul 16, 2019, 08:17 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View